పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా.. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. అదీగాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుపుకొని.. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక సినిమాకి రిలీజ్ డే నుండే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక నాలుగో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ 5వ రోజు మళ్లీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. మరి ‘భీమ్లా నాయక్’ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ‘భీమ్లా నాయక్’ మూవీ తెలుగు రాష్ట్రాలలో 88.75 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అలాగే రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ.9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.9 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా రూ.106.75 కోట్ల మేర బిజినెస్ ను చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.108 కోట్లుగా సెట్ అయింది.ఇక భీమ్లా నాయక్ 6వ రోజు 4.01 కోట్లు షేర్, 7 కోట్లు పైగా గ్రాస్ రాబట్టింది. మొత్తం 6 రోజులకు భీమ్లా నాయక్.. వరల్డ్ వైడ్ 91.02 కోట్లు షేర్, 150 కోట్ల పైగా గ్రాస్ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కి మరో 17 కోట్ల వరకు వసూల్ చేయాల్సి ఉంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. మరి భీమ్లా నాయక్ చిత్రం పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.