సినిమా సెలెబ్రెటీలు తరచుగా వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లటం పరిపాటి. విదేశాల్లోని పలు హాలిడే స్పాట్స్‌లో వాళ్లు బాగా ఎంజాయ్ చేసేస్తుంటారు. ఫ్యామిలీతో కావచ్చు.. ప్రేమించిన వారు లేదా ఫ్రెండ్స్‌తో కావచ్చు.. వెకేషన్‌ను ఎంతో సంతోషంగా గడిపేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక, ఆ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ ఉంటారు. తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. ఆ ఫొటోలు పెట్టిన సెలెబ్రిటీలు నెటిజన్ల కామెంట్లను బట్టి స్పందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నెటిజన్ల కామెంట్ల కారణంగా వారు బాధింపబడుతుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రముఖ నటి భావన బాలక్రిష్ణన్ తన ఫ్యాన్స్‌పై ఫైర్ అవ్వటం. అమె అలా ఫ్యాన్స్‌పై మండిపడటానికి ఓ కారణం ఉంది.
వాళ్లు హద్దులు దాటి ఆమెతో ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. భావన బాలక్రిష్ణన్ కొద్దిరోజుల క్రితం మాల్దీవ్స్‌కు టూర్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఫ్యాన్స్, నెటిజన్లు భావన బాలక్రిష్ణన్ మాల్దీవ్స్ పర్యటనలోని బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలని పట్టుబట్టారు. ఈ మేరకు కామెంట్ల మీద కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. వీరి ప్రవర్తనతో భావన బాలక్రిష్ణన్‌కు కోపం వచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్ పోస్టు చేశారు. ఆ రీల్‌లో ఓ పాటకు ఆమె విచిత్రంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాదు! తనను బికినీ ఫొటోలు అడిగిన వారికి తన మధ్య వేలును చూపిస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.