Actress: సినీ పరిశ్రమలో ఆత్మహత్యల పర్వాలు పెరిగిపోతున్నాయి. బెంగాల్ బుల్లితెర నటి పల్లవి డే ఆత్మహత్య ఘటన మరువకే ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ యువనటి బిడిష డే ముజుందార్ ఆత్మహత్య చేసుకుంది. అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాకు చెందిన బిడిష డే ముజుందార్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తోంది. గత నాలుగు నెలలుగా డుమ్‌డుమ్, నగెర్ బజార్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లో అద్దెకు ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ, బుధవారం కొంతమంది పోలీసులు ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు.
ఫ్లాట్ తలుపు లోపలినుంచి గడియపెట్టి ఉండటంతో దాన్ని బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. బిడిష డే తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె గదిలోంచి ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతురాలి స్నేహితులను విచారించారు. విచారణలో ఆమెకు అనుభబ్ బెర అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు తెలియవచ్చింది.అతడితో గొడవ కారణంగా ఆమె గత కొన్ని రోజులనుంచి డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాగా, బిడిష డే.. 2021లో వచ్చిన ‘క్లోన్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా నటనా రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి, బిడిష డే ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : M Ramakrishna Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత