మనుషుల్లో ఓపిక, సహనం నశించిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునేంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడే వారిలో ఇండస్ట్రీకి చెందిన వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. అవకాశాలు రావడం లేదని.. లైమ్ లైట్ నుంచి దూరం కావాల్సి వస్తుందనే కారణాలతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. అంతేకాక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీరిలో కొందరు ప్రముఖులు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా.. చాలా మంది మాత్రం ఆత్మహత్యాయత్నం చేసినవారు కావడం గమనార్హం. తాజాగా ఈ కోవలోకి మరో నటుడు చేరాడు. అవకాశాలు రాకపోవడంతో.. డిప్రెషన్‌కు గురై.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ మైకంలో పదునైన ఆయుధంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. రక్తపు మడుగులో పని ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు..
బెంగాలీ బుల్లితెర నటుడు సైబాల్ భట్టాచార్య సోమవారం రాత్రి తన నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గత కొంతకాలంగా అవకాశాలు లేకపోవడంతో ఆయన డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కోల్‌కతాలోని తన నివాసంలో సూసైడ్‌కు ప్రయత్నిస్తూ దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ‘నాకు మరో దారి కనిపించడం లేదు. నా భార్య, అత్తమ్మ..’ అంటూ ఆయన మాట్లాడుతూ.. సగంలోనే ఆ వీడియో ఆగిపోయింది. ఆ తర్వాత భట్టాచార్య తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో తల, కాళ్లను గాయపర్చుకున్నట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగా సైబాల్‌కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పైగా ఇటీవలే ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైబాల్‌కు.. ప్రోతోమా కాదంబిని సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన పలు సీరియల్స్‌లో తండ్రిగా, అంకుల్‌గా నటించారు. అంతేకాక ఆయన స్క్రిప్ట్ రైటర్, డైలాగ్స్ రచయితగానూ పని చేశాడు.
అయితే గత కొంత కాలం నుంచి సెలబ్రిటీల వరుస ఆత్మహత్యలతో బెంగాలీ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. పల్లవి డే, బిడిషా డే మజుందార్, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్న కొద్ది వారాలకే సైబాల్ ఆత్మహత్యకు యత్నించడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అసలు పరిశ్రమలో ఏం జరుగుతోంది అంటూ వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.