ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ పెన్ స్టూడియోస్ రూపొందిస్తుంది. ఈ మూవీ నిర్మాత ధవల్ జయంతీలాల్.
ఈ మూవీ గురించి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.. డబ్బింగ్, గ్రాఫిక్ వర్క్ లో కొద్ది మార్పులు చేర్పులు చేస్తున్నాం.. ఈ చిత్రం వ్యూజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ మూవీకి సంబంధించి త్వరలో పూర్తి అప్డేట్స్ అందిస్తాం అన్నారు. ఈ మూవీని దర్శకులు వివివినాయక్ దాదాపు ఎనభై రోజుల్లో పూర్తి చేశారు. ఈ మూవీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగానే పెట్టాం. ఇందులో నటించిన నటులకు సంబంధించి, అలాగే హీరోయిన్ కాల్ షీట్స్ విషయంలో కొంత గ్యాప్ రావడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. గ్రాఫిక్స్ వర్క్ మూడు నెలలు పడుతుంది.
ఇది పాన్ ఇండియా మూవీ కాదు.. పెన్ ఇండియా మూవీ. వీరిది పెద్ద ప్రొడక్షన్ సంస్థ.. ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ లాంటి పెద్ద సినిమాలు చేశారు. వివివినాయక్ దర్శకత్వంలో మా అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్ నటించడం ఎంతో సంతోషంగా ఉందని. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత మూవీ ప్రొడ్యూసర్ చూస్తానని అన్నారు. ఇక మూవీ మొత్తం చూసిన తర్వాత చప్పట్లు కొడుతూ.. ఎంతో సంతోషపడ్డారు.
ఇదే సందర్భంలో ప్రొడ్యూసర్.. వివివినాయక్ ని తమ ప్రొడక్షన్ లో రూ.500 కోట్లు ఖర్చుపెట్టి భారీగా స్థాయిలో ఒక సినిమా నిర్మిద్దామని అన్నారు. అంటే వివివినాయక్ దర్శకత్వం ఆయనకు అంతగొప్పగా నచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంటుందని ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.