'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించాడు. ఆ విషయంలో నంబర్ వన్ గా నిలిచాడు.
బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ పేరు చెప్పగానే తెలుగు సోషల్ మీడియా యూజర్స్ అలర్ట్ అయిపోతారు. సంబంధం లేకపోయినా సరే అతడిని ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ పోస్టర్ రావడంతో సోషల్ మీడియాలో ఈ హీరో తెగ వైరల్ అయ్యాడు. మే 12న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో హీరో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంటరవుతున్నాడు. ఇదిలా ఉండగానే తాను నటించిన ఓ సినిమాతో ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలున్నారు. అయినాసరే ప్రతి ఏడాది కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. అలా వచ్చినవాడే బెల్లంకొండ శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకైన ఇతడికి యాక్టింగ్ ఎంట్రీ సులువుగానే లభించింది. ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఫస్ట్ సినిమాకే సమంత, తమన్నా లాంటి స్టార్స్ తో కలిసి పనిచేశాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన వాటిలో బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘జయజానకి నాయక’ తెలుగు ప్రేక్షకుల్ని ఓ మాదిరిగా ఎంటర్ టైన్ చేసింది.
ఇక ఇదే సినిమాని ‘జయజానకి నాయక ఖూన్కర్’ పేరుతో డబ్ చేశారు. పెన్ మూవీస్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఈ మూవీని అప్ లోడ్ చేయగా.. తాజాగా అది 700 మిలియన్ల మార్కుని చేరుకుంది. ఓ సినిమా ఈ రేంజ్ వ్యూస్ సాధించడం అనేది ఇది ఫస్ట్ టైమ్. తద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రపంచ రికార్డులో భాగమయ్యాడు. యూట్యూబ్ లోనే ఈ రేంజ్ ఆదరణ దక్కించుకున్నాడంటే.. త్వరలో రాబోతున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో హిందీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మరి బెల్లంకొండ హీరో సినిమా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Jaya Janaki Nayaka becomes the first ever movie in the world to cross 700 million views on Youtube. pic.twitter.com/ossc6Jlnxz
— Abhishek Ojha (@vicharabhio) March 27, 2023