బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. జయ జానకీ నాయక సినిమాని బాలీవుడ్ లో ఎక్కువమంది చూశారు. ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మే 12న ప్రభాస్ ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అల్లుడు శ్రీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక అంటూ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎనర్జటిక్ యంగ్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మార్కులు కొట్టేశాడు. రాక్షసుడు సినిమాతో తనలో ఉన్న ఉత్తమ నటుడిని కూడా పరిచయం చేశాడు. కానీ, టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి సరైన హిట్టు పడలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు బెల్లంకొండ బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాతో ఎంట్రీకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బాలీవుడ్ లో ఎంట్రీకి ముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అక్కడ అభిమానులు ఉన్నారు. బోయపాటితో చేసిన జయ జానకీ నాయక సినిమాని యూట్యూబ్ లో తెలుగు ప్రేక్షకులు కంటే హిందీ వాళ్లే ఎక్కువ చూశారు. ఆ సినిమాతో బెల్లంకొండకు అభిమానులు అయిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచించిన శ్రీనివాస్.. ఛత్రపతి కథతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేసేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. బాలీవుడ్ ఛత్రపతి ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది.
Fandom like never before! 😍🙌🏻
After the successful teaser of the film #Chatrapathi the bollywood debutant Sreenivas Bellamkonda gets a grand welcome at the Hyderabad airport. #SreenivasBellamkonda @BSaiSreenivas @Penmovies #JayantilalGada #PenStudios #PenMarudhar #talkingbling pic.twitter.com/W3MlScMfkG— Talkingßling! (@talkingbling) April 3, 2023
అయితే సినిమా కోసం ముంబైలో సెటిల్ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు అంతా విమానాశ్రయానికి చేరుకుని శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. పూల దండలు వేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. బెల్లంకొండ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీనివాస్ క్రేజ్ చూసి.. పవన్ కల్యాణ్ రేంజ్ లో ఎంట్రీ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ క్రేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Hunk @BSaiSreenivas gets Huge welcome at Hyd airport while he returns from Mumbai after #ChatrapathiTeaser launch 🤩🤩
Fans chanting #Chatrapathi like crazy 🔥🔥
ICYM – https://t.co/Uf63FieqKJ#VVVinayak @Nushrratt @jayantilalgada @Gada_Dhaval @PenMovies @TimesMusicHub pic.twitter.com/LWzKdudi6z
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 2, 2023