సినిమా ఇండస్ట్రీలో విజయం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే కొందరి విషయంలో మాత్రం హిట్, ఫ్లాప్స్‌కు సంబంధం ఉండదనే చెప్పాలి. ఇమేజ్, పాపులారిటీ ఉన్న కొంతమంది స్టార్స్ తీసే సినిమాలకు ఇది వర్తిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
సినీ తారలకు సంబంధించిన వార్తలు, విశేషాలు అంటే మూవీ గోయర్స్‌కు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. సినీ ప్రియుల కంటే ప్రాణానికి ప్రాణంగా అభిమానించే ఫ్యాన్స్‌లో ఆ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోని విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సహజమే. ముఖ్యంగా వారి పాత ఫొటోలు, చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక స్టార్ హీరో ఫొటో బాగా వైరల్ అవుతోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారీ యంగ్ హీరో. అయితే టాలీవుడ్‌కు మాత్రం గతకొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. దీనికో కారణం ఉంది. ఒక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి స్టార్డమ్, క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఎవరే ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు. ఆయనే బెల్లంకొండ శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడే బెల్లంకొండ శ్రీనివాస్. 2014లో వచ్చిన ‘అల్లుడు శ్రీను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అదిరిపోయే డ్యాన్సులు, ఫైట్లతో మాస్ ఇమేస్ సొంతం చేసుకున్నారు. ‘జయ జానకి నాయక’ మూవీతో మంచి హిట్ కొట్టారు శ్రీనివాస్. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. దీంతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు శ్రీనివాస్. వీవీ వినాయక్ దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ చిన్ననాటి ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. గాంధీ గెటప్‌లో బెల్లంకొండ అమాయకంగా నిలుచున్న ఆ ఫొటోను ఆయన ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు.