మెగా కోడలు ఉపాసన ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉపాసన, రామ్ చరణ్ సతీమణిగా ఎంత పాపులర్ అయిందో ఆమె చేసే మంచి పనుల వల్ల కూడా భాగమే పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఉపాసన తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలు నెటిజన్లకు షేర్ చేస్తుంటారు. వాలెంటెన్స్ డే అనగానే ప్రేమికులు ఖరీదైన బహుమతులు ఇస్తూ.. శుభాకాంక్షలను సడన్ గా తెలియజేసి వారిని ఆనందానికి గురి చేయడం చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు… అంటూ వాలంటైన్స్ డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
ఇది చదవండి : రైనాను తీసుకోకపోవడానికి కారణం వెల్లడించిన CSK సీఈవో!
మెగా కోడలు ఉపాసన.. దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలంటే ఏం చేయాలో సూచనలిచ్చారు. ప్రేమలో పడడం సులభమేనని, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం పార్కులో నడిచినంత సులభం కాదని పేర్కొన్నారు. తమ వివాహ బంధానికి 10 ఏళ్లు అయిందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి ప్రేమ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. ప్రతిఒక్కరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ, అది నిజం కాదు. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై అమితమైన ప్రేమ, గౌరవం చూపించాలి అని ఉపాసన చెప్పుకొచ్చారు. ప్రేమికుల రోజు అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. మీరు, మీరు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా కలిసి ఉండాలి. ప్రియమైన వారితో కొద్ది సమయాన్ని గడపటం రొటీన్‌గా మార్చుకోవాలి.
ఇది చదవండి: ట్రెండ్ సృష్టిస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్.. లిరిక్స్ ఎలా రాశారు?
వివాహ బంధంలో ఆరోగ్యానికి ముఖ్యస్థానం ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఫిట్నెస్ గా ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడే వారికోసం కొంత సమయాన్ని కేటాయించాలి అని ఉపాసన తెలియజేసింది. ఏ కాస్త ఖాళీ దొరికినా డిన్నర్ డేట్, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. ఇలా చేయడం వల్ల మీ జీవితం మరింత అందంగా మారుతుంది. ఒకవేళ మీరు కనుక ఇది ఫాలో కాకపోతే ఇప్పటికైనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం తెలుసుకోండి. నేను చరణ్ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వాలంటైన్స్ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా మారేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి చెప్పుకొచ్చింది.
Falling in love can be easy, but staying in love might not be a walk in the park. Here’s our secret to a lifetime of happiness?#HappyValentinesDay pic.twitter.com/JatCmrPSSe
— Upasana Konidela (@upasanakonidela) February 14, 2022