తమిళ స్టార్.. దళపతి విజయ్ నటించి బీస్ట్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. సినిమా తమ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో.. తమిళనాడులో కొందరు అభిమానులు ఏకంగా థియేటర్ తెరకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీస్ట్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం నెట్టింట వైరలవుతోంది. అదే బీస్ట్ OTT విడుదల. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, ఛోటా మోటా యంగ్‌స్టర్స్ అనే సంబంధం లేకుండా… హీరోలందరి సినిమాలు నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ కూడా అదే కేటగిరీలో చేరబోతోందని సమాచారం.
ఇది కూడా చదవండి: దళపతి విజయ్ బీస్ట్ మూవీ రివ్యూ!
మే రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందట. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు ‘సన్ నెక్స్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఉంది. అందులో ‘బీస్ట్’ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక ‘బీస్ట్’ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేసినట్లు తెలుస్తోంది. మే 13న ఓటీటీలో అన్ని భాషల్లోనూ బీస్ట్ సినిమా విడుదల కానుందని సమాచారం.
ఇది కూడా చదవండి: వీడియో: బీస్ట్ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్! స్క్రీన్ కు నిప్పుపెట్టి..!
విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బీస్ట్’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అనిరుద్ సంగీతం అందించిన ‘అరబిక్ కుతు…’ సాంగ్ వైరల్ అవ్వడంతో సినిమాకు మంచి బజ్, ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ట్రెండ్ సృష్టిస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్.. లిరిక్స్ ఎలా రాశారు?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.