నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జనవరి 27న తారకరత్న గుండపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. గత ఐదు రోజులుగా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి తారకరత్న ఆరోగ్యం గురించి అనేక వార్తలు వెలువడుతున్నాయి. వైద్యులు మాత్రం.. ఇప్పటికి కూడా తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి తొలిసారి తారకరత్న విజువల్స్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతోంది.
దీనిలో తారకరత్న వెంటిలేటర్‌పై ఉండగా.. ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటో చూసి టీడీపీ కార్యకర్తలు, నేతలు, నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. హమ్మయ్య.. తారకరత్న క్షేమంగా ఉన్నారని సంతోషపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక తారక రత్న గుండె స్పందిస్తుందని.. మిగతా అవయవాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఇక బాలకృష్ణ ఐదు రోజులుగా తారకరత్న వెంటే ఆస్పత్రిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఆయన క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు.
ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనడం కోసం కుప్పం వచ్చిన తారకరత్న.. గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయనకు కుప్పం కేసీ, పీఈఎస్ ఆస్పత్రిలో వైద్యం అందించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఇక కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి.. దగ్గరుండి తారకరత్న వైద్యానికి కావాల్సిన వాటిని అమర్చుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్.. నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్దకు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. చిరంజీవి కూడా తారకరత్న పరిస్థితిపై ట్వీట్ చేశారు.
చికిత్స పొందుతున్న తారకరత్న 😥
Get Well Soon #TarakaRatna pic.twitter.com/WCEIkrBeId
— Sailendra Medarametla (@sailendramedar2) January 31, 2023