అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలకు కాస్త ఒంట్లో బాగోలేకున్నా పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటిది మందు లేని ఒక రోగం బారిన పిల్లలు పడితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఏ కష్టం కూడా రాకూడదని కోరుకుంటారు. కన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా పేరెంట్స్ తల్లడిల్లిపోతారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఇల్లంతా పరిగెత్తుతూ అందరిలో సంతోషాన్ని నింపే పిల్లలకు జ్వరం వచ్చినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే..? రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెబితే? అది ఏ పేరెంట్స్‌కైనా నరకప్రాయమే. అలాంటి పరిస్థితిని అనుభవించిన ఒక తండ్రికి టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ అండగా నిలబడ్డారు. తాము ఉన్నామని ధైర్యం ఇచ్చి, పిల్లాడి వైద్యానికి సాయం చేశారు. రఘు రంజిత్ అనే వ్యక్తికి నాలుగున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఆ పిల్లాడు ఉన్నట్లుండి గంటన్నరసేపు వరకు దగ్గుతూనే ఉన్నాడు. అతడకి చెమటలు పడుతున్నాయి. ఇంట్లో నెబ్యులైజేషన్ చేసినా ఫలితం లేదు. దగ్గు ఇంకా ఎక్కువైంది.
ఊపిరి పీల్చుకోవడం కష్టమవడంతో రంజిత్ తన కొడుకును బెంగళూరులోని కిండర్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు కూడా నెబ్యులైజేషన్ చేసి స్టెరాయిడ్స్ ఇచ్చారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తర్వాతి రోజు టెస్టులు చేయగా పిల్లాడికి అడినో వైరస్ పాజిటివ్ అని తేలింది. ఇది చాలా డేంజరస్ వైరస్ అని వైద్యులు చెప్పారు. శ్వాస తీసుకునే సమయంలో శబ్దం వచ్చే వాళ్లు దీని వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. మూడో రోజు పిల్లాడికి ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తుల్లో 50 శాతం వరకు వైరస్ కమ్మేసిందని డాక్టర్లు అన్నారు. సులభంగానే ఊపిరి పీల్చుకుంటున్న బాబు.. బయటకు వదిలేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడ్ని వెంటిలేటర్ పై పెట్టాలని చెప్పారు. అయితే అందుకు రోజుకు రూ.75 వేల నుంచి లక్ష రూపాయల దాకా అవసరమన్నారు. అంత డబ్బు తన దగ్గర లేదని.. ఎలాగైనా బిడ్డను కాపాడండని డాక్టర్లను రంజిత్ వేడుకున్నాడు.
డబ్బు సమస్యను పక్కనబెడితే.. రంజిత్ కొడుక్కి అటాక్ అయిన అడినో వైరస్‌కు మందు లేదు. పిల్లాడే కోలుకోవాలి.. తాము సపోర్ట్ మాత్రమే ఇస్తామని వైద్యులు చెప్పారు. దీంతో రంజిత్ తన ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కట్టేశాడు. అయినా సరిపోకపోవడంతో ఫ్రెండ్స్ సాయంతో ఇంకొంత మనీ అడ్జస్ట్ చేశాడు. అప్పుడు మాన్స్టర్ టీమ్ (ట్రెండ్ పీఎస్పీకే)కి తన పరిస్థితిని వివరించాడు. అక్కడి నుంచి ఆన్లైన్ ఫండ్ రైజింగ్ ద్వారా రూ.2.42 లక్షలు వచ్చాయి. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన రంజిత్‌కు పవర్ స్టార్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు.. ఇలా అందరు హీరోల ఫ్యాన్స్ సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రంజిత్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. మొత్తానికి అతడి కుమారుడు వేగంగా కోలుకుంటున్నాడు. బాబు ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైరస్ చనిపోయింది, కానీ ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.
What Exactly Happened in my son’s case!!
Day 1 Nite 8:30pm – Continuous ga daggutunnadu for 1 &half hour, that too with sweating, Intlone nebulization chesam, adhi inka ekkuva aipoindi, Daddy oopiri peelchukodam kashtam ga undi anadu
Contd..(1/n)
— PJ Raghu Ranjith (@Ranjith_OG) May 16, 2023
Please Support our Janasainik @Ranjith_OG 🙏
He is raising funds for his son, Kalyan Hrishikesh who is suffering from Wheezing-Associated respiratory infection (WARI) & is undergoing treatment at Aster Hospital, Bangalore.
Read more – https://t.co/ljkwN5G72U
Donate now to help…
— Trend PSPK (@TrendPSPK) May 13, 2023