పూరీ జగన్నాథ్.. టాలీవుడ్‌లోనే కాకుండా లైగర్ సినిమాతో ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా.. తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమా వైఫల్యంపై అటు పూరీ జగన్నాథ్, ఇటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. పూరీ అయితే సినిమా ఫ్లాప్ అని తెలియగానే జిమ్‌కి వెళ్లి బాగా వర్కౌట్ చేసి ఆ స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకున్నాని చెప్పుకొచ్చాడు. ఇంక రౌడీ హీరో అయితే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాం కానీ, రీచ్ కాలేదని తెలిపాడు. ఈ సినిమా వల్ల బయ్యర్లకు ఎంతో నష్టం కలిగింది. అయితే ఆ నష్టాన్ని కూడా పూరీ జగన్నాథ్ తీరుస్తానని చెప్పాడు. కాస్త సమయం కావాలని కోరాడు. అయితే డిస్ట్రిబ్యూటర్లు కొందరు పూరీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తామంటూ బెదిరింపులు కూడా పంపారు.
అలాంటి బెదిరింపులకు పూరీ జగన్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. నాకు ఎలాంటి అవసరం లేకపోయినా కూడా.. మీకు డబ్బు ఇస్తానని చెప్పాను. ఇలా ఎక్కువ చేసి బెదిరించాలని చూస్తూ ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత అదే అంశానికి సంబంధించి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. అవేంటంటే.. “నేను ఎప్పుడైనా మోసం చేస్తే.. దగా చేస్తే అది నన్ను నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు. నేను నా ప్రేక్షకులకు జవాబుదారిని. మళ్లీ ఇంకో సినిమా తీస్తా, వాళ్లని ఎంటర్‌టైన్ చేస్తా” అంటూ పూరీ జగన్నాథ్ మరోసారి స్పందించిన విషయం తెలిసిందే. ఈ వార్త కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు.
అలాగే ఈ అంశంపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా స్పందించాడు. పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దానికి పూరీ జగన్నాథ్ ఫొటో కూడా జత చేశాడు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. బండ్ల గణేశ్ పూరీ జగన్నాథ్‌కు కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. బండ్లన్న పూరీ జగన్నాథ్ తన భార్య, కుమార్తెతో కలిసున్న ఫొటోని షేర్ చేశాడు. దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అవేంటంటే.. నువ్వు ఆడియన్స్ ని మాత్రమే కాదు.. ముఖ్యంగా నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావు అని అర్థం వచ్చేలా పూరీ ఆ ఫొటోని షేర్ చేశాడని చెబుతున్నారు. అయితే చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి బండ్లన్న- పూరీ మధ్య కాస్త చెండిందని తెలుస్తోంది. చోర్ బజార్ సినిమా ఈవెంట్‌కి పూరీ రాకపోవడాన్ని బండ్ల గణేశ్ స్టేజ్ మీద బాహాటంగానే ప్రశ్నించాడు. అప్పటి నుంచి బండ్ల గణేశ్‌పై పూరీ కూడా గుర్రుగా ఉన్నాడని చెబుతున్నారు. మరి.. ఈ కౌంటర్‌తో ఏమవుతుందో చూడాలి.
నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న audience ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTUALLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా, వాళ్ళని entertain చేస్తా.
– #PuriJagannadh
@PuriConnects 👍 pic.twitter.com/KdjJEUb7YL— BANDLA GANESH. (@ganeshbandla) October 30, 2022