టాలీవుడ్‌లో నటుడిగాను, నిర్మాతగాను అందరికి సుపరిచితులు బండ్ల గణేష్. తన ముక్కుసూటి తనంతో ఏదనుకుంటే అది వెంటనే చెప్పే రకం ఆయనది. ఇక మొదట్లో సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు బండ్ల గణేష్. చిత్ర పరిశ్రమలోకి సాధారణ నటుడిగా ఏంట్రీ ఇచ్చిన ఆయన నేడు టాప్ ప్రొడ్యుసర్‌ల జాబితోకి చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్‌కు నిర్మాతగా వ్యవహరించి బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత తీన్‌మార్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలను నిర్మించాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటాడు ఈ బడా ప్రొడ్యూసర్. సమాజంలో జరుగుతున్న సమకాలీన రాజకీయాలపైనై కాకుండా అన్ని సమస్యలపై స్పందిస్తూ తన వైఖరిని తెలియజేస్తుంటాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏంటనుకుంటున్నారా..? ఏం లేదండి.. నేను త్వరలో ట్విట్టర్‌కు గుడ్ చెప్పనున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు ఎలాంటి వివాదాలు లేవని, ఇక వివాదాలు కూడా వద్దంటూ పోస్ట్ పెట్టాడు బండ్ల గణేష్. ఇక ఆయన నిర్ణయంపై స్పందించిన అభిమానులు రిప్లై ఇస్తూ ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021