సమాకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ తనదైన శైలీలో తన భావాన్ని వ్యక్తి పరుస్తూ వివాదాస్పదంగా నిలిచే వ్యక్తి బండ్ల గణేష్. ఆయన సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు నచ్చింది నచ్చినట్టు ముక్కుసూటిగా చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక ఇదే కాకుండా సమాజాన్ని ఉద్దరించే రీతిలో ట్విట్ లు చేస్తూ అందరినీ మోటివేషన్ చేస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం బండ్ల గణేష్ ఎవరూ ఊహించని రీతిలో ట్విట్టర్ లో ఓ సంచలన ఆడియో ఫైల్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఆడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఆ ఆడియో ఫైల్ లో ఏముందంటే.. ‘‘తల్లిదండ్రుల్ని, భార్యబిడ్డల్ని మినహా జీవితంలో ఎవర్నీ నమ్మకూడదు. మనల్ని మనం నమ్ముకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మనల్ని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని, మన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకి మంచి భవిష్యత్తును, అద్భుతమైన జీవితాన్ని ఇద్దాం. ఎందుకంటే వాళ్లు మనపై కోటి ఆశలతో జీవిస్తున్నారు. కొన్నింటిపై ఉన్న ఇష్టాలతో మన అనుకునే వాళ్లకి అన్యాయం చేయవద్దు’’ అని బండ్లగణేశ్ ఆడియోలో పేర్కొన్నారు.
అయితే ఉన్నట్టుండి బండ్ల గణేష్ ఈ విధమైన ఆడియో ఫైల్ షేర్ చేయడం వెనుక ఏదైన బలమైన కారణం ఉందా అని సినీ, రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. ఇక బండ్లన్న తాజాగా షేర్ చేసిన ఆడియోను విన్న నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకోలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన బండ్ల గణేష్ ఆడియో ఫైల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2022