తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న నటుడు బండ్ల గణేష్. ఆయన నటుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కూడా రాణించారు. అయితే ఆయన నిర్మతగా వ్యవహరించి.. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో వంటి సూపర్ హిట్ సినిమాలను సైతం నిర్మించాడు. అయితే కొన్ని సినిమాలు విజయం సాధించగా, మరికొన్ని సినిమాలు మాత్రం ఆశించినంత సక్సెస్ ను అందుకోలేకపోయాయి. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. కొంత కాలం తర్వాత బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు, డేగలబాబ్జీ వంటి సినిమాల్లో నటించారు. ఇకపోతే బండ్ల గణేష్ అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో తరుచు వివాదాల్లో నిలుస్తున్న విషయం మనందిరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై స్పందించిన ఆయన ఊహించిన విధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజకీయాల వలన జీవితంలో నేను చాలా నష్టపోయాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ నా ఆత్మీయులే అంటూ బండ్ల గణేష్ రాసుకొచ్చాడు. అయితే బండ్ల గణేష్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపొతే.. నా నాలుక కోసుకుంటానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇకపోతే రానున్న ఎన్నికల్లో బండ్ల గణేష్ జనసేన తరుఫున పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ రాజకీయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ వ్యాఖ్యలతో నిజంగానే బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల వైపు చూడరా? మళ్లీ ఏ పార్టీపై అనుకూలంగా స్పందించరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైన మర్మం దాగి ఉందా అనే ఆరోపణలు వస్తున్నాయి.
రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే 🙏🙏🙏 https://t.co/ecO3UFOFAu
— BANDLA GANESH. (@ganeshbandla) November 29, 2022