పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరభక్తుడు ఎవరు అనగానే గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ బండ్ల గణేశ్. మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం చూపించే ఇతడు.. మిగతా హీరోల కంటే పవన్ అంటే చాలా ఇష్టపడతాడు. ఏ చిన్న సందర్భం దొరికినా సరే సోషల్ మీడియాలో తన అభిమానాన్ని బయటపెడుతుంటాడు. కొన్నిసార్లు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. అలా గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ని తిట్టిన బండ్ల గణేశ్ ఆడియో ఒకటి లీకైంది. ఇప్పుడు దాని గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే… పవన్ కల్యాణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల గణేశ్ ఉన్నాడంటే ఫ్యాన్స్ కి పండగే. తీన్ మార్, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ ఈవెంట్స్ లో ఏం జరిగిందో మీకు ఇప్పటికే తెలుసు. ఇక ఈ ఏడాది పవన్ ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజైంది. ఇక ఈ సినిమా ఈవెంట్ కి బండ్ల గణేశ్ రాలేదు. తనని ఆహ్వానించకపోవడంపై బండ్ల గణేశ్ చాలా ఫ్రస్టేషన్ కి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన ఓ ఆడియో లీకైంది. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేశ్ తిట్టాడు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయాడు.
ఇక ఆ వాయిస్ తనది కాదని అప్పట్లో బుకాయించిన బండ్ల గణేశ్.. ఇప్పుడు అందరికీ షాకిచ్చాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ ని తిట్టిన వాయిస్ తనదేనని అన్నాడు. అప్పుడేదో కోపంలో తిట్టేశానని, ఆ తర్వాత ఆయనకు సారీ చెప్పానని బండ్ల గణేశ్ తెలిపాడు. ఏదైతేనేం చాలా రోజులకు నిజం ఒప్పుకొన్ని బండ్ల గణేశ్.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, పవన్ మరోసారి అవకాశమిస్తే రూ.1000 కోట్ల మార్కెట్ ఏంటో చూపిస్తానని ఇటీవలే బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేయడం విశేషం. మరి బండ్ల గణేశ్-త్రివిక్రమ్ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Blockbuster stuff 😆 pic.twitter.com/EMadxHYJ5I
— ₹evanth Palwai (@revanth47) October 2, 2022