నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్.. తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగి.. వారికి చుక్కలు చూపిస్తాడు. అంతేకాక వర్తమాన అంశాలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటాడు బండ్ల గణేష్. ఈ క్రమంలో ఆయన చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదాలను క్రియేట్ చేస్తుంటాయి. కానీ బండ్ల గణేష్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేష్ ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూ తెగ వైరలవుతోంది. దీనిలో మరోసారి దర్శకుడు పూరి జగన్నాథ్ మీద కామెంట్స్ చేయగా.. అదే ఇంటర్వ్యూ లైవ్‌లో ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి కాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇంటర్వ్యూ సందర్భంగా.. ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మీకు వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అని బండ్ల గణేష్‌ను ప్రశ్నించాడు. వెంటనే ఇంటర్వ్యూ మధ్యలోనే బండ్ల గణేష్… అనిల్ కుమార్ యాదవ్‌కు కాల్ చేశారు. ‘హాయ్ అనిల్ అన్నా.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా’ అని ప్రశ్నించాడు. అందుకు మాజీ మంత్రి.. ‘నేను నీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాను అన్న’ అంటూ ఆన్సర్ చెప్పాడు. వెంటనే బండ్ల గణేష్ ఇక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Bandla Ganeshhhh💥 pic.twitter.com/q2vwWGg08S
— 𝗟𝗜𝗞𝗛𝗜𝗧𝗘𝗦𝗛 𝗖𝗛𝗢𝗪𝗗𝗔𝗥𝗬👑 (@LikhiteshChow) October 2, 2022
అలానే గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీకి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇవ్వడంపై గణేష్ స్పందించారు. తనకు ఆ ఎంపీతో ఎలాంటి శత్రుత్వం లేదని.. కమ్మ సామాజిక వర్గం అంటుంటే.. అలా ట్వీట్ చేశానన్నారు. చంద్రబాబుతో తగాదాలు ఉంటే వాళ్లు, వాళ్లు తేల్చుకోవాలని.. కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడొద్దని చెప్పానని వివరించారు బండ్ల గణేష్. ఇక సదరు ఎంపీతో తనకు 20 ఏళ్లుగా పరిచయం ఉందని.. ఆయన అన్నాడు.. తానూ కూడా ట్వీట్ చేసి కౌంటర్ ఇచ్చానన్నారు. ఎంపీ కనిపిస్తే ఇప్పటికీ నమస్తే అంటూ పలకరిస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా.. ఏదైనా అంటే తన మనసు నొచ్చుకుంటుందన్నారు గణేష్. ఆయనను ఎవరు ఏమన్నా.. తాను భరించలేనని చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, కొడాలి నానితో పరిచయం ఉంది అన్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ను అంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఇక ఆంధ్ర రాజకీయాలతో తనకు సంబంధం లేదు అన్నాడు బండ్ల గణేష్. తమ కుటుంబం 50 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చిందని.. షాద్‌నగర్ తన సొంత ఊరు అని చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా విమర్శిస్తే.. తాను వెంటనే కౌంటర్ ఇస్తానన్నారు. అలానే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు గణేష్. తాను కాంగ్రెస్ పార్టీకి అభిమానినని.. తనకు రాజకీయాల్లో రాణించాలనే ఆశ ఉందన్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానిని అన్నారు.