అవును…నిజంగానే బండ్ల గణేష్ మనసు మార్చుకున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ఖాతాకు గుడ్ బై చెప్పనున్నానంటూ ట్విట్టర్ వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయం పట్ల మీడియాలో సైతం చర్చ జరిగింది. ఇక తాజాగా మరో ట్విట్‌తో నేను మనసు మార్చున్నానంటూ వెనక్కి తగ్గాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ట్విట్ చేస్తూ..పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈ రోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇచ్చారు. వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ఈ వార్తతో ఆయన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. టాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా అందిరికి పరిచయం అక్కర్లేని పేరు బండ్ల గణేష్. టాలీవుడ్‌లో నిర్మాతగానూ ఆయన ఓ మెట్టు ఎక్కి బడా ప్రొడ్యూసర్ జాబితాలో చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్‌సింగ్ అనే సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ దెబ్బతో బండ్ల గణేష్ క్రేజ్ ఒక్కసారిగా పైగి ఎగిసిపోయింది. ఇక ఆయన సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు మోస్తున్నారు.
కాగా ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాల్లో కూడా నటించారు బండ్ల గణేష్. దీంతో సినిమాలతో పాటు సమకాలీన అంశాలపై అప్పడప్పుడు ట్విట్టర్‌లో స్పందించే ఆయన ఏది చేసిన కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్విట్‌తో తన అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) August 17, 2021