పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ వేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పవన్ ఫ్యాన్స్ లో.. కాదు,కాదు.. పవన్ భక్తులలో నెంబర్1 ఎవరంటే ముందుగా బండ్ల గణేశ్ పేరే వినిపిస్తుంది. సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండే బండ్లని తీన్ మార్ మూవీతో నిర్మాతని చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతోంది. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీకి సరికొత్త రికార్డ్స్ పరిచయం చేసింది. ఇక అక్కడ నుండి బండ్ల గణేశ్ పవన్ కి భక్తుడు అయిపోయాడు. పొరపాటున ఏదైనా ఆడియో ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాల్సి వస్తే.. బండ్ల గణేశ్ స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాంటి బండ్ల గణేశ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఓ సరికొత్త పేరు పెట్టుకున్నాడు.
బండ్ల గణేష్ ఇందుకు సంబంధించి తాజాగా చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా అయితే బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కీర్తిస్తారు. తనకు తాను భక్తుడిని అని ప్రకటించుకున్నారు. కానీ.., ఇప్పుడు తన దేవుడికి కొత్త పేరు పెట్టుకున్నాడు బండ్ల. “భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్‌ని దేవర అని పిలుస్తాను’ అంటూ బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేశారు. దీంతో పాటు.. గబ్బర్ సింగ్ సమయంలో దిగిన ఓ స్టిల్‌ను బండ్ల గణేష్ ఈ పోస్ట్ కి జత చేశాడు. దీంతో.., బండ్ల చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది పవన్ ఫ్యాన్స్ షో కూడా పవన్ ని దేవర అని సంబోదిస్తూ.., ఈ ట్వీట్ కి కింద కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో బండ్లతో మరో సినిమా చేయొచ్చన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి.., బండ్ల చేస్తున్న ఈ హంగామాని గుర్తించి తన భక్తుడికి పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్ ఇస్తాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
నా దేవర తో నేను భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను @PawanKalyan 🙏🙏 pic.twitter.com/YAn6UoIiHT
— BANDLA GANESH. (@ganeshbandla) June 27, 2021