రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 05:23 PM IST

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కమెడియన్లు తమ సత్తా చాటారు. కొంతమంది మంది కమెడియన్లు నిర్మాతలుగా మారి పలు చిత్రాలు నిర్మించారు. అలాాంటి వారిలో బండ్ల గణేష్ ఒకరు. చిన్న కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత స్టార్ కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు సెట్ కావని పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం మళ్లీ తన రాజకీయ ఎంట్రీపై ట్విట్స్ చేశారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న వేళ రాజకీయ పార్టీల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఏ సినిమా వేడుకలో అయినా సరే బండ్ల గణేష్ స్టేజ్ పైకి వస్తే అక్కడి వాతావరణం మామూలుగా ఉండదు.. తెగ సందడిగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన పేల్చే ఒక్కో డైలాగ్ అలా ఉంటుంది.  ముఖ్యంగా జనసేనా అధినేత నటుడు పవన్ కళ్యాణ్ గురించి చేసే ప్రసాంగాల్లో బండ్ల గణేష్ మాటలు అభిమానులకు పూనకాలు వచ్చే విధంగా ఉంటాయి. ఆ మద్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మద్యలో విరమించుకున్నారు. తాజాగా  బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

 బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ట్వీట్లు అటు రాజకీయ నాయకులకు ఇటు అభిమానులకు ఆశ్యర్యకరంగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లోకి రాను అని బండ్ల గణేష్ పలు ఇంటర్య్వూలల్లో తేల్చి చెప్పాడు. కుటుంబ బాధ్యతల కారణంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చప్పారు. ఇప్పుడు సడన్ గా ఈ ట్వీట్లతో అందరినీ అయోమయంలో పడేసాడు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఆ పార్టీ విజయం సాధించకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటాననే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు.

బండ్ల గణేష్ చేసిన ట్వీట్లలో ఏముందంటే.. ‘నీతిగా నిజీయితీగా నిబద్దతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజీకీయాలంటే కష్టం రాజీకీయాలంటే పౌరుషం రాజీకీయాలంటే శ్రమ రాజీకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా’ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. మరి తన ప్రాణంగా అభిమానించే పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనాలో చేరుతార లేదా మరే ఇతర రాజకీయ పార్టీలో చేరుతార అన్నది వెల్లడికాలేదు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed