కేవలం ఒకే ఒక ట్వీట్ ద్వారా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోగల ఒకే ఒక వ్యక్తి ఎలాన్ మస్క్.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్ని ఒక్క ట్వీట్ తో తన వైపు తిప్పుకోగల మరో వ్యక్తి బండ్ల గణేష్. ట్వీట్ ల విషయంలో ఆయన్ని ఎలాన్ మస్క్ గా అభివర్ణించ వచ్చు. ఇక బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. అయితే ఇతని గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బండ్ల గణేష్.. అటు రాజకీయ రంగంలోనూ.. ఇటూ సినీ పరిశ్రమలోనూ తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న కమెడియన్ స్థాయి నుంచి నేడు ఓ బడా నిర్మాతగా మారి పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక బండ్ల ఏదైనా ట్వీట్ చేశాడు అంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవ్వడం ఖాయం. నిన్నగాక మెున్న జీవితారాజశేఖర్ దంపతుల మీద చేసిన ట్వీట్ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.
అదీ కాక తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ త్వరగా సినిమా చేయండి దేవరా.. అంటూ ట్వీటర్ ద్వారా వేడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆన్సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిట్ చాట్ లో భాగంగా ఓ నెటిజన్ ఇలా అడిగాడు..”సార్ మీరూ ఒక న్యూస్ ఛానెల్ పెట్టోచ్చు కదా”? దీనికి బండ్ల గణేష్ సమాధానం ఇస్తూ.. ”ప్లానింగ్ లో ఉన్నాం బ్రో” అంటూ ఎమోజీని జత చేశాడు.
బండ్ల గణేష్ సమాధానం చూసిన సినీ, రాజకీయ అభిమానులు అవునా.. ఐతే మీ ఛానెల్ పేరేంటి? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒక వేళ బండ్ల గణేష్ ఛానెల్ పెడితే జనసేన పార్టీకి విధేయత ప్రకటించే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి బండ్ల గణేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In Planning bro 😎 https://t.co/8GgmZ2TTbj
— BANDLA GANESH. (@ganeshbandla) August 27, 2022