చిత్ర పరిశ్రమలో హీరోలకు అభిమానులు ఉండడం కామన్. అయితే అలాంటి హీరోలకు కూడా కొంత మంది హీరోలంటే అభిమానం ఉంటుంది. ఉదాహరణకు హీరో నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఈక్రమంలోనే ఇండస్ట్రీ మెుత్తం ఇష్టపడే వ్యక్తి ఒకరున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా చిరంజీవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత బండ్ల గణేష్. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బండ్ల గణేష్.. ఈ పేరు తెలియని సిని అభిమాని ఉండడు. తనదైన స్పీచ్ లతో సెలబ్రిటీలనే కాక సగటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై చేసిన స్పీచ్ మరిచి పోక ముందే ఈ మధ్యే పూరీ జగన్నాథ్ పై ఇచ్చిన స్పీచ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. తాజాగా మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుసగా ట్వీట్ లు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.
ట్వీట్టర్ లో బండ్ల గణేష్ ఈ విధంగా రాసుకొచ్చాడు..”ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం. ఈ స్టైల్ చూసే మేము సినిమా రంగం వైపు పరుగులు పెట్టాం. అదే విధంగా ఈ స్టైల్ చూసే సినిమా రంగం అనేది ఒకటుంటుంది.. అని ఇక్కడ ఏమైనా సాధించవచ్చు.. అని నమ్మకం కల్పించుకున్నాం. ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు.. అని వచ్చాం. మీ ఆహార్యం, మీ నడక.. మీ నడత.. చూసే మేమందరం మీకు అభిమానులుగా మారిపోయాం. మీరు ఎందరికో భరోసా ఇస్తూ.. ఇలానే మీ స్టైల్ ని కొనసాగించాలని మా కోరిక.” అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి పలు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తాజాగా ఓ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఆ పిక్ ని జత చేస్తూ తాజాగా ట్వీట్ చేశాడు. మరి మెగాస్టార్ పై ఈ రేంజ్ లో ప్రశంసలు కురింపిచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం.
ఈ స్టైల్ చూసే మేము సినిమా రంగంలో సినిమా రంగం వైపు పరుగులు పెట్టాం
ఈ స్టైల్ చూసే మా జీవితాలకు
సినిమా రంగం అనేది ఒకటుంటుంది.. ఇక్కడ ఏమైనా సాధించవచ్చు
అని నమ్మకం కల్పించుకున్నాం.
ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు @KChiruTweets pic.twitter.com/YaOSnD8pan— BANDLA GANESH. (@ganeshbandla) August 7, 2022
అని నమ్మకం కల్పించుకున్నాం.
ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు అని నిర్ణయానికి వచ్చాం
ఈ స్టైల్ చూసే అందరం మీకు అభిమానులుగా మారి పోయాం..
మీరు ఎప్పటికి ఈ స్టైల్ లోనే ఉండాలని మా కోరిక
ఎందరికో భరోసా.. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే
నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం . pic.twitter.com/kCPJV1yEtG— BANDLA GANESH. (@ganeshbandla) August 7, 2022
ఇదీ చదవండి: Jr NTR కు ఆరోగ్య సమస్య.. 4 వారాలు రెస్ట్ తీసుకోమన్న వైద్యులు!
ఇదీ చదవండి: తెలుగు పాటకు.. ఇండియన్ క్రికెటర్ భార్య మాస్ డ్యాన్స్! వీడియో వైరల్