డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. అనేక విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు ఎందరిని స్టార్ హీరోలను చేశాడు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో పూరీ ఒకరు. ఒకానొక్క దశలో పూరీ పని అయిపోయిందని అందరు భావించారు. అలాంటి స్థితి నుంచి కూడా బౌన్స్ అయి మళ్లీ స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘లైగర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా పూరీ తనయుడు ఆకాష్ పూరీ నటించిన చిత్రం ‘చోర్ బజార్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ అన్న అంటూనే పూరీ జగన్నాథ్ కు క్లాస్ పీకాడు. పూరీ జగన్నాథ్ సతిమణీ లావణ్య గురించి గొప్పగా చెప్పారు.
డైరెక్టర్ పూరీ తనయుడు ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “చోర్ జజార్”. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో మూవీ టీమ్ బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ డైరెక్టర్..పూరీ సతీమణి లావణ్య చాలా విషయాలు తెలిపారు.
“నేను దూరంగా ఉంటే మా వదిన లావణ్య ఫోన్ చేసింది ఫంక్షన్ కి రావాలని కొరింది. నేను ఈ ఫంక్షన్ కి వచ్చింది మా వదిన కోసం. ఒక అమ్మ ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి, సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి. సీతా దేవికి ఉన్నంత సహనం ఉంది ఆవిడకి. పూరీ గారు పెద్ద డైరెక్టర్ అవుతారు.. భూమి బద్దలు కొడతారు.. ఇండస్ట్రీని దొబ్బేస్తాడు..అని పెళ్లి చేసుకోలేదు ఆమె. ఆయన జేబులో రెండు వందలు ఉన్నాయి అని చెప్పినా.. హైదరాబాద్ వచ్చి సనత్ నగర్ గుడిలో పూరీని పెళ్లి చేసుకుంది. పూరీ కష్టాల్లో ఉన్న సమయంలో ఆమె తోడుగా నిలబడింది. ఇప్పుడు పూరీ సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు.
కానీ పూరీ జీవితంలోకి ముందుగా వచ్చింది ఆమెనే. ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ లావణ్య అమ్మే శాశ్వతం. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ ది, పూరీ అన్నదే” అని బండ్ల గణేష్ అన్నారు. అయితే.. ర్యాంప్, వ్యాంప్ లో వస్తుంటాయి, పోతుంటాయి అని నిర్మాత బండ్ల గణేష్ అన్న మాటల ఎవరిని ఉద్దేశించి అని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి.. బండ్ల గణేష్ అన్న మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Bandla Ganesh: కొడుకు సినిమా ఫంక్షన్ కు రాని పూరీ! బండ్ల గణేష్ కోపానికి కారణం?