తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ వెండితెరపై స్టార్ కమెడియన్ గా సత్తా చాటారు. అనూహ్యంగా ఆయన బడా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ చిన్న చిన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగిన బండ్ల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. కొంత కాలం రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ అనూహ్య పరిణామాల మద్య వాటికి గుడ్ బాయ్ చెప్పాడు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టు కి హాజరు అయ్యారు. వివరాల్లోకి వెళితే..
సినీ నిర్మాతగా మారిన తర్వాత బండ్ల పలు చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సయయంలో కొంత మంది సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. అయితే ఆ డబ్బును సకాలంలో చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. ఇక కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బండ్ల గణేష్ పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి.. వీటిలో ఒక కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారని తెలిపారు. ఈ కేసు తిరిగి ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో కెరీర్ బిగినింగ్ లో కమెడియన్ గా ఉన్నప్పటికీ తర్వాత నిర్మాతగా మారారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇతర స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించారు. కొన్ని సినిమాలు ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయని అప్పట్లో వర్తాలు వచ్చాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని.. ఈ కారణంతోనే ఆయన నిర్మాణ రంగంవైపు వెళ్లకుండా తన వ్యాపారం చూసుకుంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చిత్ర నిర్మాణం కోసం పలువురు బడా వ్యాపారుల వద్ద కోట్లలో డబ్బులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని తిరిగి చెల్లించడలో విఫలం కావడంతో ఆయనపై పలు చోట్ల చెక్ బౌన్స్ కేసులు పెట్టారు బాధితులు.
ఈ క్రమంలోనే ప్రకాశం, గుంటూరు తో పాటు పలు ప్రాంతాల్లో కేసులకు హాజరయ్యారు బండ్ల. గతంలో ముంబైకి చెందిన నటుడు, వ్యాపార వేత్త సచిన్ జోషితో కూడ ఎన్నో గొడవలు మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ మద్య ఈ వివాదాలపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. తనను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది కావాలనే కేసులు వేశారని తెలిపారు.