తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో బండ్ల గణేష్ ని మించిన వారు ఉండరు అని అంటారు. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతారు పవన్ కళ్యాన్ పరమభక్తుడు బండ్ల గణేష్. సినిమా అయినా.. రాజకీయాలు అయినా ఆయన మార్క్ చూపించుకుంటారు. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోబిజీగా కావాలని చూస్తున్నారు.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నానని బండ్ల గణేష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బండ్ల గణేష్ తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో గణపతి సచ్చిదానంద స్వామి జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. బండ్ల మైసూరు వెళ్లి గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు. అంతే కాదు ఆయన బయోపిక్ తీస్తానంటూ.. ఆదివారం ట్విట్టర్ ద్వారా బండ్ల గణేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఎన్నడూ లేని ఆనందం… మరువలేని ఈ రోజు… ఒళ్ళు గగ్గురుపరిచే సన్నివేశం… స్వామీజీ తానుగా వివరించిన అయన జన్మ రహస్యం… ఇంకా ఎన్నో అంటూ ట్వీట్ చిసిన కొద్ది సేపటికే.. ‘ఇన్ని రోజులకు కనబడ్డ నిజమయిన అవధూత… అయన పాడాల చెంత మీ బండ్ల గణేష్’ అంటూ మరో ట్వీట్ చేశారు.
ఎన్నడూ లేని ఆనందం… మరువలేని ఈ రోజు… ఒళ్ళు గగ్గురుపరిచే సన్నివేశం… స్వామీజీ తానుగా వివరించిన అయన జన్మ రహస్యం… ఇంకా ఎన్నో…🙏 pic.twitter.com/jMTxCA1hFv
— BANDLA GANESH. (@ganeshbandla) October 23, 2021
ఇన్ని రోజులకు కనబడ్డ నిజమయిన అవధూత… అయన పాడాల చెంత మీ బండ్ల గణేష్…🙏🙏🙏🙏 pic.twitter.com/OPqO6vSUba
— BANDLA GANESH. (@ganeshbandla) October 23, 2021
ఇక ఈ ఉదయం‘అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు’ చాలా ఎమోషనల్ గా బండ్లగణేష్ ట్విట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ మేరకు మైసూర్‌లో స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటున్న ఫోటోని పంచుకున్నాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్లు, స్వామిజీతో ఆయన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..🙏 pic.twitter.com/JqqY06pvTt
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2021