బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మధ్య ఏం వివాదాలు ఉన్నాయో తెలియదు గానీ విజయ్ దేవరకొండ ఏదైనా మాట్లాడితే బండ్ల గణేష్ దానికి కౌంటర్ వేస్తున్నారు. ఆ మధ్య లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో నెపోటిజం గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసి బండ్ల గణేష్ దృష్టిలో పడ్డ సంగతి తెలిసిందే. అయ్య.. తాత.. అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ కి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ మరువక ముందే బండ్ల గణేష్ మరోసారి విజయ్ ని టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండకి సంబంధించిన ఫోటోను.. తన ఫోటోతో జత చేసి.. రెండూ పోలిక పెడుతూ ఒక పోస్ట్ పెట్టారు బండ్ల గణేష్. ఒక ఫోటోలో బండ్ల గణేష్ తన తండ్రికి ట్రిమ్మర్ తో హెయిర్ ట్రిమ్ చేస్తున్నారు. మరొక ఫోటోలో విజయ్ దేవరకొండ తండ్రి ముందు కాలు పైకి ఎత్తి కూర్చుని ఉన్నారు.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. బండ్ల గణేష్ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో విజయ్ కి చెబుతున్నారు.మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు. వారిని ప్రేమించడం, పూజించడం మన ధర్మం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఫోటోతో తన తల్లిదండ్రులను గుర్తుచేసినందుకు విజయ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. దీంతో తాను తన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తానో, ఎంత పూజిస్తానో చెబుతూనే.. విజయ్ తన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇదే అని అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్ ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు బండ్ల గణేష్ ని చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంతమంది ఎవరి ప్రేమ వారిది. విజయ్ దేవరకొండకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా.. అయినా తండ్రి, కొడుకు స్నేహంగా ఉండడం కూడా తప్పేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య స్నేహం ఉండబట్టే విజయ్ అలా కూర్చున్నారు. ఇందులో తప్పు ఎలా కనబడిందో బండ్ల గణేష్ కి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరిష్టం వారిది, ఇలా పోలిక పెట్టి కించపరచడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Thank you @TheDeverakonda for this pick remembering parents 👍 https://t.co/Qaap7k3Tof
— BANDLA GANESH. (@ganeshbandla) December 11, 2022