Saravana Dhanapal: ప్రముఖ బెలూన్ ఆర్టిస్ట్, నటుడు శరవణ ధన్‌పాల్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి మృత్యువాతపడ్డారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. కాగా, ధన్‌పాల్ బెలూన్ ఆరిస్ట్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎన్నో స్టేజి షోలు ఇచ్చారు. డా.రాజ్‌కుమార్, విష్ణువర్థన్, అంబరీశ్, రజనీకాంత్, రణ్‌వీర్‌సింగ్ వంటి ప్రముఖులు ఆయన షో చూసి ప్రశంసలు కురిపించారు. ధన్‌పాల్ ఓ తమిళ సినిమాలోనూ నటించారు. సేవా కార్యక్రమాలలోనూ ధన్‌పాల్ ముందుండే వారు. పేద పిల్లలకోసం ‘అగ్ని: ఆర్ట్ ఫర్ ఆల్’ను నెలకొల్పారు.
వారికి డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్‌లో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. ఎంతో మంది పేద పిల్లలకు ప్రపంచం మొత్తం చుట్టి వచ్చే ప్రతిభను బహుమతిగా ఇచ్చారు. ఇక, శరవణ ధన్‌పాల్ కుటుంబ నేపథ్యానికి వస్తే.. బెంగళూరుకు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టారాయన. తండ్రిలేడు. తల్లి జేపీ నగర్‌లో అరటి పళ్లు అమ్ముతూ ధన్‌పాల్‌ను పెంచి పెద్ద చేసింది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. పై చదువులు కూడా స్కాలర్‌షిప్‌లో పూర్తి చేశారు. మరి, బెలూన్ ఆర్టిస్ట్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శరవణ ధన్‌పాల్ మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RRR పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాజమౌళి!