ఆమె ప్రముఖ సీరియల్ నటి. ఎప్పుడో పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కానీ సీరియల్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. పలు షోల్లోనూ కంటెస్టెంట్, హోస్ట్ గా ఎంటర్ టైన్ చేసింది. తెలుగువాళ్లకు ఎంతో ఇష్టమైన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తాను తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఇన్ స్టాలోనూ మంచి భర్తతో తీసుకున్న కలర్ ఫుల్ పిక్ ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నేళ్ల క్రితం మహిళల్ని బాగా ఆకట్టుకున్న సీరియల్స్ లో ‘బాలిక వధు’. దీన్ని తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో ప్రసారం చేస్తే సూపర్ హిట్ అయింది. ఇందులో లీడ్ రోల్ చేసిన అవికా గోర్ ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంది. ఇక ఈ సీరియల్ లేటెస్ట్ వెర్షన్ కూడా కొన్నాళ్ల క్రితం ప్రసారమైంది. ఇందులో అత్త పాత్ర పోషించిన నేహా మర్దా… తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఇన్ స్టాలో బేబీ బంప్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది.
పదేళ్ల క్రితం అంటే 2012లో ఆయుష్మాన్ అగర్వాల్ ని పెళ్లి చేసుకున్న నేహా మర్దా.. బాలికా వధు, డోలి అర్మానో కీ క్యూన్ రిస్తోన్ మైన్ కట్టి బట్టి లాంటి సీరియల్స్ లో నటించింది. ‘ఝలక్ దిక్లాజా’ ఎనిమిదో సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. ఖత్రోంకి ఖిలాడీ రియాలిటీ షోలోనూ గెస్ట్ గా పాల్గొని ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మిగతా సెలబ్రిటీలు ఆమెకు కంగ్రాచ్యూలేషన్స్ చెబుతూ విష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.