తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఈ పేరు వినగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చే పేరు దివంగత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈయన తెలుగు భాషలోనే కాకుండా అనేక చిత్ర సీమలో నటించి తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని ఎల్లలు దాటించారు. అయితే ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందూమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.వీళ్లు కూడా ఇప్పటికీ అనేక సినిమాల్లో నటించి తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక విషయం ఏంటంటే..? నేడు నందమూరి బాలకృష్ణ తనయుడు తేజ మోక్షజ్ఞ పుట్టిన రోజు. దీంతో బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు స్వయంగా బాలయ్య ఇంటికి చేరుకున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మోక్షజ్ఞ కెమెరాకు కనిపించారు. ఇందులో యంగ్ గా కనిపిస్తూ కాస్త సన్నబడ్డట్లు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన మోక్షజ్ఞ ఫోటోలను చూస్తే గనుక ఖచ్చితంగా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నట్లుగానే తెలుస్తోంది. ఇక దీంతో పాటు కమెడియన్ రఘుతో దిగిన ఫోటోల్లో కూడా లావు తగ్గి కనిపిస్తుండటంతో ఈ వార్తకు బలం చేకూర్చినట్లు అవుతోంది. తాజాగా విడుదలైన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మోక్షజ్ఞ సినమా ఎంట్రిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.