బాలయ్య పాడితే మీలో చాలామంది ట్రోల్ చేస్తారు. అదే బాలయ్య ఇప్పుడు ఫ్రొఫెషనల్ సింగర్స్ ఏ మాత్రం తగ్గకుండా పాడి అదరగొట్టేశాడు. ఆడిటోరియం మొత్తం చప్పట్లు, అరుపులతో దద్దరిల్లింది.
బాలయ్య అనేది పేరు కాదు ఎమోషన్. కొందరు మాత్రం ఈయన్ని అప్పుడప్పుడు ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఆయన పాడిన పాటల వల్ల కావొచ్చు, చేసిన కొన్ని పనుల వల్ల కావొచ్చు.. ఫన్నీగానే ట్రోల్ చేస్తుంటారు. అలాంటి బాలయ్య ఇప్పుడు.. అభిమానులు మాత్రమే కాదు ప్రతిఒక్కరూ షాకయ్యేలా చేశాడు. ఎందుకంటే తనని ఏ విషయంలో అయితే ఇప్పటివరకు విమర్శిస్తూ వచ్చారో.. దాన్నే గుర్తుపెట్టుకుని మరీ ప్రతిఒక్కరికీ కౌంటర్ ఇచ్చేశాడు. ఇది చూస్తే మీరు కూడా బాలయ్యలో ఈ టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా హీరోల్లో చాలామంది ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఓసారి ఫెయిలతే, ట్రోల్స్ వస్తాయి. దీంతో ఆ ప్రయోగాలు చేయడం మానేస్తారు. ఈ విషయంలో మాత్రం బాలయ్య కాస్త స్పెషల్. గతంలో లెజెండ్ మూవీలోని పాటని ఓ ఈవెంట్ సందర్భంగా పాడారు. అప్పటినుంచి ఆ సాంగ్ విన్న ప్రతిసారి కూడా బాలయ్యని ఫన్నీగా ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ మనసులు గుర్తుపెట్టుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు ఎంతో కష్టమైన ‘శివశంకరీ’ పాటని నెక్స్ట్ లెవల్లో పాడి చూపించారు. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
ఈ మధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారం క్రితం హైదరాబాద్ లో జరగ్గా.. తాజాగా ఖతార్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా క్లాసికల్ సాంగ్ అయిన ‘శివశంకరీ’ని బాలయ్య చాలా చక్కగా ఎలాంటి తొట్రుపాటు లేకుండా నీట్ గా పాడారు. ఫ్రొఫెసనల్ సింగర్ కాకపోవడం వల్ల కాస్త శ్రుతి తప్పినట్లు అనిపించి ఉండొచ్చు కానీ అలాంటి కష్టమైన తీసుకుని పూర్తిగా పాడటం అంటే సాధారణమైన విషయమేం కాదు. ఈ విషయంలో కచ్చితంగా బాలయ్య మెచ్చుకుని తీరాల్సిందే. కావాలంటే మీరు కూడా ఈ వీడియోని చూడండి. మేం చెప్పింది వందకి వందశాతం నిజమని మీరే ఒప్పుకుంటారు. మరి బాలయ్య సింగింగ్ చూసి-విన్న తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
balayya 🔥 pic.twitter.com/hDcGbkRpKD
— devipriya (@sairaaj44) May 6, 2023