చిత్రపరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరూ తమ తమ కుమారులు, కుమార్తెలను సినిమాలలో పరిచయం చేస్తుంటారు. అయితే.. ఇక్కడ కూడా నటన మీద ఆసక్తి ఉన్నవారిని హీరోహీరోయిన్లుగా.. వేరే టెక్నికల్ ఎలిమెంట్స్ లో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లను ఆ వైపుగా, ఇవన్నీ కాదని ప్రొడక్షన్ ఇంటరెస్ట్ ఉందంటే ప్రొడ్యూసర్స్ గా పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్ లో దశాబ్దాలుగా నందమూరి హీరోల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ మొదలుకొని బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు స్టార్స్ గా కంటిన్యూ అవుతున్నారు.
ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఫ్యామిలీలో ఆయన చిన్నల్లుడు భరత్ సినిమాలపై ఆసక్తిగా ఉన్నారట. గీతమ్ విద్యాసంస్థలకు చైర్మన్ అయిన భరత్ మతుకుమిల్లి.. బాలయ్య సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యారట. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య తదుపరి లైనప్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాని 14 రీల్స్ వారితో పాటు తేజస్విని, భరత్ సంయుక్తంగా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య తదుపరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పై ఉండగానే బోయపాటి సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే స్వీయ దర్శకత్వంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో.. ఆదిత్య 369 సీక్వెల్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ ఒకదాన్ని మించి ఒకటి హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. చూడాలి మరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో! మరి బాలయ్య చిన్నల్లుడు భరత్ సినీ ఎంట్రీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Telugu Mahila Visakhapatnam (@telugumahilavisakhapatnam)