టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్త్ను టాక్ షో ‘‘ అన్‌స్టాపబుల్’. ఈ షో మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తయింది. ఎన్నో వండర్స్‌ను క్రియేట్ చేసింది. హోస్ట్‌గా బాలయ్య బాబు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీగా మొదటి సీజన్‌ను పూర్తి చేశారు. తాజాగా, సీజన్ 2 స్టార్ట్ అయింది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు ఎన్నో పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఎంతో సరదాగా ఈ ఎపిసోడ్ ముగిసింది. ఎసిసోడ్ 2కు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ వచ్చారు. తాజాగా, మూడో ఎపిసోడ్ గెస్ట్‌లుగా శర్వానంద్, అడవి శేషు వచ్చారు.
ఈ ఎపిసోడ్ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిగితా ఎపిసోడ్‌ల కంటే మరింత ఫన్నీగా ఈ ఎపిసోడ్ సాగింది. గెస్ట్‌లను బాలయ్య అడుగుతున్న ప్రశ్నలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాలయ్య శర్వానంద్‌ను ‘‘ మీ ఫోన్‌లో ఎన్ని వీడియోలు ఉన్నాయి’’ అని అడిగారు. అందుకు శర్వానంద్ సమాధానం ఇస్తూ ‘‘ సార్! మీ నాన్న గారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశాడు. మీకు సంబంధించిన అన్ని వివరాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడు చెప్పమంటారా?’’ అని అన్నాడు. దీంతో బాలయ్య బాబు కంగుతిన్నాడు. వెంటనే ‘‘మీలాంటి వాళ్లను షోకు పిలవటమే తప్పు’’ అంటూ నవ్వేశారు.
కాగా, బాలయ్య షోకు మున్ముందు స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓ సారి షోలో బాలయ్య త్రివిక్రమ్‌కు ఫోన్ చేశారు. షోకు ఎప్పుడు వస్తున్నావని అడిగాడు. ‘నీతో పాటు ఎవరిని తీసుకురావాలో తెలుసు కదా’ అని అన్నారు. అంటే త్రివిక్రమ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా షోకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉందంట. అంతేకాదు! దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల కూడా బాలయ్య టాక్ షోకు రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.