హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా.. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతుంది. స్టార్ హీరో, దర్శకులు, హీరోయిన్లు, కమెడియన్లతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో తెలుగులో టాప్ లో దూసుకుపోతున్న ఈ సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఇక ఫినాలే అంటే మాములూగా ఉండదు కదా.. అందుకే గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఇక ఎప్పటిలానే బాలకృష్ణ-మహేష్ మధ్య సరదా సంభాషణలు దొర్లాయి. కేబీర్ పార్క్ కు వెళ్లినప్పుడు తనకు పాము ఎదురుపడిన సంఘటన.. తర్వాత తన పరిస్థితి గురించి వివరించారు మహేష్.
ఇది కూడా చదవండి : మహేశ్ బాబు సినిమాలో విలన్ గా స్టార్ హీరో!
ఇక మహేష్ బాబు ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయిస్తోన్న సంగతి తెలిసిందే. దీని వెనక గల కారణాన్ని.. ఈ షోలో వెల్లడించారు మహేష్ బాబు. తన కుమారుడు గౌతమ్ ఆరు వారాల ముందుగానే పుట్టాడని.. జన్మించిన సమయంలో కేవలం తన అరచేయి అంత ఉన్నాడని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు. తన దగ్గర డబ్బు ఉంది కనుక.. ఆధునిక వైద్యం చేయించి.. కుమారుడిని దక్కించుకున్నానని తెలిపాడు. ఆ సమయంలోనే తనకు ‘‘నా దగ్గర డబ్బులున్నాయి.. మెరుగైన వైద్యం చేయించగలిగాను.. మరీ లేని వాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచన’’ వచ్చిందని మహేష్ బాబు తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆహా.. సారాపై బాలకృష్ణ పద్యం.. వీడియో వైరల్
దానిలో భాగంగానే చిన్నారుల గుండె ఆపరేషన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. వీటితో పాటు అనేక ఆసక్తికర అంశాలను ముచ్చటించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మహేష్ బాబు చిన్నారులకు చేస్తోన్న సాయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.