తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వారి మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య.. గత కొన్ని దశాబ్దాలుగా తన సత్తా చాటుతున్నారు. టాప్ హీరోగా ఉంటూనే, ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడం ఒక్క బాలకృష్ణకి మాత్రమే సాధ్యం అయ్యింది.
ఇందులో భాగంగానే బాలయ్య ఇప్పుడు హోస్ట్ గా కూడా మారారు. బాలకృష్ణ యాంకర్ గా ప్రముఖ ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో మొదలైన విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని గెస్ట్ తీసుకొచ్చిన బాలకృష్ణ, ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నానిని గెస్ట్ గా తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.
సెల్ఫ్ మేడ్ కి సర్ నేమ్ అంటూ నానిని బాలయ్య షోకి ఆహ్వానించారు. ఇక వీరిద్దరూ కలసి క్రికెట్ ఆడటం, సినిమా డైలాగ్ లు చెప్పుకోవడం ప్రోమోలో హైలెట్ అయ్యాయి. ఇక నాని ఈ మధ్య కాలంలో తనపై వచ్చిన కాంట్రవర్సీల విషయంలో కూడా ఈ ఎపిసోడ్ లో స్పందించినట్టు అర్ధం అవుతుంది. అయితే.. గెస్ట్ ఎవరైనా, హోస్ట్ గా చేస్తున్న బాలయ్య స్పీడ్ తగ్గదుగా! “సాయంత్రం పూట రిలాక్సేషన్ కి నాన్నగారి సినిమాలు, కాస్త మ్యాన్షన్ హౌస్ అంటూ కిక్ ఇచ్చే కామెంట్స్ చేశారు బాలయ్య”. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., ఈ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.