వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి ప్రస్తావిస్తూ పొరపాటున నోరు జారిన విషయం తెలిసిందే. అది కాస్తా వివాదాలకు దారి తీయడంతో పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యలను సున్నితంగా ఖండించారు. అలనాటి హీరోలను చులకన చేసి మాట్లాడడం అంటే మనల్ని మనం చులకన చేసుకోవడమే అని అన్నారు. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ విషయంపై బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందించారు.
నాగేశ్వరరావు అంటే ఇవాళ్టికి తనకు అభిమానం ఉందని, ఆయన మహానటుడని అన్నారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండే కళ్ళు అని, తన పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుకి అందించడం జరిగిందని వ్యాఖ్యానించారు. బాబాయ్ పై ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలన్న విషయాలను నేర్చుకున్నానని అన్నారు. ఫ్లోలో వచ్చిన మాటలకు, వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సంబంధం లేదని వ్యాఖ్యానించారు. మరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదంపై స్పందించిన బాలయ్య. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ రెండు కళ్లలాంటివారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారంచేస్తే సంబంధం లేదు-బాలయ్య#Balayya
— NTV Breaking News (@NTVJustIn) January 26, 2023
నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను-బాలయ్య#Balakrishna #ANR
— NTV Breaking News (@NTVJustIn) January 26, 2023