పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.
ఇక పోలీసు యంత్రాంగం కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బెంగుళూరు అంతా హై అలెర్ట్ ప్రకటించారు. ఇక చివరిసారిగా పునీత్ రాజ్ కుమార్ ని చూసేందుకు అభిమానులంతా కడసారి చూపు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే అభిమానులతో పాటు తెలుగు స్టార్ హీరోలు కూడా కడసారి చూపు కోసం కంఠీరవ స్టేడియానికి వెళ్తున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. దీంతో పునీత్ పార్థీవ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక సోదరుడైన శివరాజ్ కుమార్ ను బాలకృష్ణ ఓదార్చారు. పునీత్ రాజ్ కుమార్ కి బాలకృష్ణకి మధ్య విడదీయరాని బంధం ఉందని. గతంలో వీళ్లిద్దరూ చాలా వేదికల్లో సైతం పాల్గొన్నారు. బాలకృష్ణ పాటు శివబాలజీ, నరేష్, ప్రభుదేవా తదితరులు పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.