‘బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్యా’…. జనరేషన్స్ ఎన్ని మారినా బాలయ్య మాత్రం ఎవర్ గ్రీన్. అలాంటి ఎనర్జీ బాలయ్య సొంతం. అది సినిమా అయినా.. స్మాల్ స్క్రీన్ పై షో అయినా ఆయనలో జోష్ మాత్రం అస్సలు తగ్గదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు బాలయ్య పోటీ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన కొత్త లుక్ వైరల్ కావడంతో బాలయ్య మరోసారి టాక్ ఆఫ్ ది న్యూస్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల విషయంలో ఎప్పుడూ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసే బాలయ్య… లుక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. సినిమాల సంగతేమో గానీ.. గతేడాది ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షో చేశారు. ఇందులో మ్యాన్లీగా కనిపించిన బాలయ్య.. తనలో ఏ మాత్రం చరిష్మా తగ్గలేదని ప్రూవ్ చేశారు. బిగ్ స్క్రీన్ పై, ఇటు స్మాల్ స్క్రీన్ పై తనని కొట్టే వాడు లేడు అనేలా కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు బరువు తగ్గి, మ్యాన్లీ లుక్ లో కనిపించి, అభిమానుల్ని సర్ ప్రైజ్ చేశారు.
గతేడాది డిసెంబరులో ‘అఖండ’గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ప్రెజెంట్ బాలయ్య-శ్రుతిహాసన్ తో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్య.. ఇండస్ట్రీలో 48 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే #48GloriousYearsOfNBK పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
48 వసంతల సినీ ప్రస్థానంలో తండ్రి ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక, జానపద, చారిత్రక, భక్తిరస, సైన్స్ ఫిక్షన్, సాంఘిక చిత్రాల చేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాత్రమేనని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి బాలయ్య సినీ జర్నీ గురించి, ఇప్పటికీ మెంటైన్ చేస్తున్న లుక్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణకు తీరని ఆ ఒక్క కోరిక ఏమిటంటే..