నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఈ క్రమంలోనే తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య.
ఓ మనిషి మన నుంచి దూరం కావొచ్చు.. కానీ అతడు పంచిన ప్రేమ, మంచి, పలికిన మాట, చేసిన సాయం ఎప్పటికీ దూరం కావు. మరి అలాంటి మనిషి మన నుంచి దూరం అయితే.. ఆ బాధ వర్ణాణాతీతం. ప్రస్తుతం నందమూరి కుటుంబం ఇలాంటి బాధనే అనుభవిస్తోంది. నెల రోజుల క్రితం నటుడు నందమూరి తారకరత్న మన నుంచి దూరం అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అయితే తరకరత్న పేరు అభిమానుల్లో చిరకాలం గుర్తుండిపోయేలా ఓ నిర్ణయం తీసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తన కుటుంబంలో వచ్చిన ఇలాంటి కష్టం ఏ కుటుంబంలో రాకూదు అంటూ కీలక నిర్ణయం తీసుకుని తారకరత్నపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇంతకీ అబ్బాయ్ కోసం బాబాయ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఇక తారకరత్న మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర మనోవేధనకు గురౌతోంది. అనుక్షణం భర్తను తలచుకుంటూ.. తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉంది. ఇక తారకరత్న మరణం ఎక్కువగా కలచివేసింది ఎవరిని అంటే.. బాలయ్యనే అని చెప్పాలి. బాలయ్య-తారకరత్న మధ్య ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. తారకరత్న హాస్పిటల్ లో చేరిన దగ్గర నుంచి చివరి వరకు దగ్గరుండి మరీ అన్ని విషయాలు చూసుకున్నారు బాలయ్య. ఎంత ప్రేమ ఉంటే చివరి వరకు ఇలా చేస్తాడు చెప్పండి. ఇక తారకరత్నపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు బాలయ్య.
ఈసారి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు బాలకృష్ణ. తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య. ఇంతకీ బాలయ్య తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే? తన ప్రాణానికి ప్రాణమైన తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక హిందూపురంలో తాను నిర్మించిన హాస్పిటల్ లో హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. దాంతోపాటుగా నిరుపేదల వైద్యం కోసం రూ. కోటీ 30 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ పరికరాలను ఆ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాడు బాలయ్య.
ఇక ఈ హాస్పిటల్ లో చిన్నపిల్లలకు ఉచితంగా భోజనంతో పాటుగా వారికి కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఫ్రీగా ఇవ్వనున్నారు. తారకరత్న పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ.. మరోసారి తారకరత్నపై తనకు ఉన్న ప్రేమను చాటిచెప్పాడు. మరి తారకరత్నపై ప్రేమను ఎప్పటికప్పుడు చాటి చెబుతూనే.. నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న బాలకృష్ణ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.