టాలీవుడ్‌లో అప్పుడప్పుడు ఒక హీరో.. మరో హీరో షూటింగ్ సెట్‌కి వెళ్లి సందడి చేయడం.. ఆ ఫోటోలు చూసి అభిమానులు మురిసిపోవడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి చోటు చేసుకుంది. కాకపోతే ఓ హీరో కోసం వేసిన సెట్‌లో.. మరో హీరో సినిమా షూటింగ్ జరపుకుంది. అదే ఆచార్య సెట్‌లో బాలయ్య మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
ఇది కూడా చదవండి: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! రాజమౌళి దర్శకత్వంలో బాలకృష్ణ!
ఆ వివరాలు.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అఖండ సక్సెస్‌తో జోరుమీదున్న బాలకృష్ణ అదే ఉత్సాహంతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోకాపేట్‌లో జరుగుతోందని తెలుస్తోంది. అయితే గతంలో ఆచార్య సినిమా కోసం వేసిన సెట్‌లో బాలయ్య మూవీ షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది.
ఇది కూడా చదవండి: చీరనే ఆయుధంగా మార్చి.. వందల మందిని కాపాడిన వృద్ధురాలు!
ఆచార్య మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. మరో 4 వారాల్లో ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆచార్య కొరకు కొరటాల స్పెషల్ గా వేయించిన సెట్‌లో బాలయ్య మూవీ షూట్ జరుగుతోంది. బాలయ్య సినిమాకు సంబంధించి మేకర్స్ వేర్వేరు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్నారు. బాలయ్య-శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. క్రాక్ సినిమాను మించిన హిట్‌గా ఈ సినిమాను నిలపాలని గోపీచంద్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
ఇది కూడా చదవండి: ఒక్క మాటతో.. అందరి మనసులు గెలిచిన తెలుగు కుర్రాడు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.