తెలుగు సినీ, రాజకీయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయారు లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ . నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు. రాజకీయ నాయకుడిగా భారతీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు యన్టీఆర్. మే 28న ఆయన జయంతి. ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.
యన్టీఆర్ జన్మస్థలం అయిన నిమ్మకూరులో జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది.మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన తనయుడు బాలకృష్ణ మే 28 న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ‘శత పురుషుని శత జయంతి ఉత్సవాలు’ ఒక లేఖను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.
తమ కుటుంబంలో ప్రతి నెల ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు పేర్కొన్నారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్లి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. అలాగే సంవత్సరం మొత్తం ఐదు సినిమాలు, రెండు సదస్సులతో శతజయంతి ఉత్సవాలను రామకృష్ణ థియేటర్‌లో ఘనంగా నిర్వహించబోతున్నట్లు బాలయ్య తెలిపారు. ప్రతి నెల రెండు పురస్కార ప్రధానోత్సవాలు కూడా నిర్వహిస్తున్నట్లు బాలకృష్ణ అన్నారు.