ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలతో పాటు హీరోలు సైతం పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, మేజర్, కార్తికేయ 2 సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో కంటెంట్ ఉంటే మనం కూడా పాన్ ఇండియా వైడ్ ట్రై చేయొచ్చని భావిస్తున్నారు యంగ్ హీరోలు. ఇప్పటికే లైగర్ సినిమాతో విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదే బాటలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, నాని ‘దసరా’, తేజ సజ్జా ‘హనుమాన్’, సందీప్ కిషన్ ‘మైఖేల్’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, అఖిల్ ‘ఏజెంట్’, రామ్ పోతినేని ఇలా అందరూ పాన్ ఇండియా బరిలో దిగుతున్నారు.
ఇదే పాన్ ఇండియా పోరులో దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నాడట నందమూరి నటసింహం బాలకృష్ణ. గతేడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. వీరసింహారెడ్డి సినిమాతో 2023 సంక్రాంతికి సందడి చేయనున్నాడు. ఈ సినిమా లైన్ లో ఉన్నప్పుడే అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేసిన బాలయ్య.. తదుపరి సినిమాను ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవును.. బాలకృష్ణతో ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్.. ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అదికూడా ‘ స్వామి రామానుజాచార్య’ బయోపిక్ ని తెరకెక్కించనున్నట్లు తాజాగా ప్రకటించి బాలయ్య ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు.
ఏంటి.. మాస్ హీరోగా పేరొందిన బాలయ్యని రామానుజాచార్య పాత్రలో చూడాలా అని షాక్ అవుతూనే.. సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతుంది అనేసరికి అవునా అనుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రముఖ ప్రొడ్యూసర్ రవి కొట్టారక్కరతో పాటు చిన్నజియర్ స్వామి పర్యవేక్షణలో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేయనున్నట్లు సి. కళ్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సినిమాలతో పాటు అన్ స్టాపబుల్ షో ద్వారా ఓటిటిలో కూడా దుమ్మురేపుతున్న బాలయ్య.. మరి రామానుజాచార్య సినిమాలో ఎలా ఉండబోతున్నారో చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
#NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishna #Ramanujacharya Biopic pic.twitter.com/7MbSaWNZ5w
— BuzZ Basket Memes (@ursBuzzBasket) December 9, 2022