తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ అంటే ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే హీరోగా కొనసాగుతూ వచ్చారు. నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలయ్య మాస్ హీరోగా ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ప్రస్తుతం ఆయన హీరోగానే కాదు.. రాజకీయ నేతగా కొనసాగుతున్నారు.. హిందూపురం ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
ఇదిలా ఉంటే ఈ మద్య సాయి ధరమ్ తేజ్, సిద్దార్థ్, రామ్ గాయాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ ఆహా ఓటిటి కోసం ఓ టాక్ షో చేయబోతున్నారు. దీనికి సంబదించిన ఫోటో షూట్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కాలికి గాయం అయినట్లు సమాచారం.
బాలయ్య ఆ గాయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా షూట్ లో పాల్గొన్నారట. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నందమూరి అభిమానులను ఫిదా చేసేస్తోంది. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. త్వరలోనే ప్రోమో, ఫోటోలోతో కలిపి ఆహా సంస్థ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్.