గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ప్రాధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బాలయ్య అభిమానులు గుణశేఖర్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
తీసింది తక్కువ సినిమాలే అయినా సరే.. భారీ సెట్‌లతో మంచి ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచిపోయాయి. రుద్రమదేవి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. తాజాగా శాకుంతలం చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు దర్శకుడు గుణశేఖర్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయం సాధించేలేదు. దాంతో బాలకృష్ణ అభిమానులు గుణశేఖర్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. శాకుంతలం సినిమా రిజల్ట్‌కు, బాలకృష్ణ ఫ్యాన్స్‌కు మధ్య సంబంధం ఏంటి.. వాళ్లు ఎందుకు గుణశేఖర్‌ను తిడుతున్నారు అంటే.. ఎనిమిదేళ్ల వెనక్కి వెళ్లాలి.
అనుష్క ప్రధాన పాత్రలో, రానా, బన్నీ ముఖ్య పాత్రల్లో నటించిన రుద్రమదేవి చిత్రం 2015లో విడుదలైంది. ఈ సినిమాకు గుణశేఖరే దర్శకుడు. తెలుగు జాతి చారిత్రక వైభవాన్ని చాటుతూ తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని.. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరాడు గుణశేఖర్. కానీ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గుణశేఖర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2017లో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదలయ్యింది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం.. పన్ను మినహాయింపు ఇచ్చారు.
అలాగే అదే ఏడు ప్రకటించిన నంది అవార్డుల్లో.. ‘రుద్రమ దేవి’ సినిమాకు కనీసం జ్యూరీ అవార్డ్ కూడా ఇవ్వలేదు. తన సినిమాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రభుత్వాన్ని ‘ప్రశ్నించడం తప్పా?’ అనే టైటిల్‌తో ఒక ఓపెన్ లెటర్‌ను గుణశేఖర్ ట్విట్టర్‌లో షేర్ చేయడం సంచలనంగా మారింది. ఇక తాజాగా శాకుంతలం సినిమా విడుదల తర్వాత బాలయ్య అభిమానులు.. గతంలో గుణశేఖర్ రాసిన ప్రశ్నిండం తప్పా లేఖను రీపోస్ట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు. ప్రశ్నించడాలు, పలకరించడాల మీద ఉన్న శ్రద్ధ.. నువ్వు తీసే సినిమా కంటెంట్, క్వాలిటీ మీద పెడితే.. నంది అవార్డు కాకపోయినా కనీసం.. సుబ్బిరామిరెడ్డి అవార్డయినా వస్తుంది.. శాకుంతలం సినిమాను ఆస్కార్‌కు పంపిద్దామా సార్ అంటూ ఎద్దేవా చేస్తూ.. ట్వీట్ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Karma is Gunashekhar!! @Gunasekhar1#Shakuntalam 😂 pic.twitter.com/LZez3fl0Hm
— Jay ✨ (@NTR_NBK_CULT) April 14, 2023
Prasninchu ippudu.. na cinema bavundhi kadha .. award ichesthara ani https://t.co/eYxOCoy5ph
— Brinda (@B4Politics) April 14, 2023
ఈ ప్రశ్నించడాలు, పలకరించడాలు మీద ఉన్న శ్రద్ధ నీ సినిమా కంటెంట్ మరియు క్వాలిటీ మీద పెడితే నంది అవార్డు కాకపోయినా కనీసం సుబ్బిరామిరెడ్డి అవార్డు అయినా వస్తుంది…
I’m telling that https://t.co/huDdQEsCJZ pic.twitter.com/IEVhw6E1z3
— S I V A (@Sivachinta214) April 14, 2023
#Shaankuthalam ni Oscar ki pampudhama sir? https://t.co/3tSOiK95Hf pic.twitter.com/VAPvO128c5
— Rick Sanchez (@Gazzorpazorp) April 14, 2023