హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన బాలయ్య పుట్టిన రోజు వేడుకకు ఆయన నారా బ్రాహ్మిణి హజరయ్యారు. ఈ క్రమంలో బాలయ్య కుటుంబ సభ్యులతో సెల్ఫీ దిగేందుకు అభిమానలు ఆసక్తి చూపించారు. అభిమానులకు సెల్ఫీ ఇవ్వమ్మా.. అంటూ తేజశ్వనితో బాలయ్య అన్నారు. దీంతో స్వయంగా ఆమె అభిమానుల నుంచి ఫోన్ తీసుకుని వారికి సెల్ఫీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నందమూరి బాలయ్య తన 62వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు బసవతారకం, నందమూరి తారక రామారావుల ఆశీస్సులతో తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి జరుపుకున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి 62 కిలోల కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ పుట్టినరోజు వేడుకకు బాలకృష్ణ నారా బ్రాహ్మిణి, బాలయ్య మనవళ్లు హాజరయ్యారు. బాలయ్యకు ఆయన మనవళ్లు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలో అక్కడ ఉన్న ఆస్పత్రి సిబ్బంది, అభిమానులు బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఆరాటపడ్డారు. దీంతో వారిని గమనించిన బాలయ్య కొందరికి సెల్ఫీ ఇచ్చారు.
ఇదీ చదవండి: హైకోర్టులో మోహన్ లాల్ కు చుక్కెదురు.. 3 నుండి 7 ఏళ్ళవరకు జైలుశిక్ష పడొచ్చని వార్తలు!ఇదే క్రమంలో “ఫాన్స్ కి ఓ సెల్ఫీ ఇవ్వమ్మా”అంటూ నవ్వుతూ నారా బ్రాహ్మిణితో అంటారు. దీంతో ఆమె అక్కడ ఉన్న కొందరికి సెల్ఫీ ఇచ్చింది. మరికొందరు ఇబ్బంది పడుతుంటే.. “ఇటు ఇవ్వు అక్క నేను తీస్తాను” అంటూ వారి వద్ద ఫోన్ తీసుకుని నారా బ్రాహ్మిణినే స్వయంగా ఫోటోలు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. “మా బాలయ్య కూతురు మనస్సు బంగారం” అంటూ నందమూరి అభిమానలు కామెంట్స్ చేస్తున్నారు. మరి… ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.