సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‍లో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్‌డే సందర్భంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో కేక్ కట్ చేశాడు. అనంతరం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఓపీడీ బ్లాక్ ప్రారంభించాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పలువురు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. బాలయ్యకు వియ్యంకుడు చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళాసేవ, ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేష అభిమానుల ఆదరణ చూరగొంటున్న మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం కావాలని.. ఎనలేని కీర్తి సంపదలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.(1/2)#HBDNBK pic.twitter.com/ySxktlpCoG
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2022
వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా బాలయ్యకు విషెస్ చెప్పారు. నా స్నేహితుడు, అన్ స్టాపబుల్, డైనమిక్ నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో రఘురామ కితాబిచ్చారు.
Warm birthday greetings to my dear friend, the unstoppable and dynamic Nandamuri Balakrishna garu. Wishing him good health and happiness always! 💐#HappyBirthdayNBK #HBDGodOfMassesNBK pic.twitter.com/XaAKxbtA7k
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 10, 2022