తెలుగు ప్రముఖ దర్శకుడు బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా దక్షిణాది సిని అభిమానులకు ఎన్నో అంచనాలుంటాయి. అయితే గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన లెజెండ్, సింహ వంటి సినిమాలు కూడా భారీ విజయాలే సాధించాయి. అయితే మరోసారి హైట్రిక్ కొడదామనుకుని బోయపాటి బాలకృష్ణతో కలిసి మరోసారి అఖండ అనే సినిమా రూపొందించి థియేటర్ లోకి వదిలారు.
ఇటీవలె విడుదలైన ఈ మూవీ టాక్ పరంగానే కాకుండా కలెక్షన్ ల పరంగా కూడా దూసుకుపోతోంది. మరోసారి హైట్రిక్ కొడదామనుకున్న వీరిద్దరి కోరిక కూడా ఫలించినట్లైంది. ఇక విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నమోదు చేసుకున్న అఖండ మూవీ రిలీజ్ తర్వాత అంచనాలకు మించి హిట్ కొట్టి ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు పొందింది.
అయితే తాజా సమాచారం ప్రకారం భారీ విజయాన్ని అందుకున్న అఖండ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసే పనిలో ఉన్నాయట కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు. ఈ మూవీ రీమేక్ హక్కలను దక్కించుకునేందుకు బడా నిర్మాణ సంస్థలు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే ఇందులో అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగణ్ ఇద్దరిలో ఒకరు హీరో పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు సమచారం. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ అఖండ రీమేక్ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.