బలగం భామ బోల్డ్‌ కామెంట్స్‌.. డబ్బు ఇస్తే దానికి కూడా రెడీ అంటూ..

బలగం సినిమాతో కావ్య కల్యాణ్‌రామ్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. పొట్టి పిల్ల అంటూ కుర్రాళ్లు సాంగులు కూడా పాడేసుకుంటున్నారు. తాజాగా, ఆమె కొన్ని బోల్డ్‌ కామెంట్లు చేశారు.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 05:10 PM IST

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్‌ కావ్య కల్యాణ్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. గంగోత్రి, ఠాగూర్‌, బన్నీ వంటి హిట్టు సినిమాల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఉస్తాద్‌’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ‘మసూద, బలగం’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేశారు. బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించటంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. తాజాగా, ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమాల్లో నటించే విధానంపై ఆమె బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు. డబ్బులు ఎక్కువ ఇస్తే ఎలాంటి సీన్లలో నటించడానికైనా తాను సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. తాజాగా, కావ్య మీడియాతో మాట్లాడుతూ.. నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో నటించాలని అన్నారు. అప్పుడే సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని తెలిపారు. ఇండస్ట్రీలో లిప్‌లాక్‌ సీన్స్‌, బెడ్‌ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు. మంచి కథ ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి తనకు అభ్యంతరం లేదన్నారు.

అయితే, అలాంటి సీన్లలో నటించడానికి ఎక్కువ డబ్బు ఇ‍వ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బోల్డ్‌ కామెంట్లపై సోషల్‌ మీడియాలో ఒకరకంగా రచ్చ మొదలైంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కావ్య హద్దులు దాటి మాట్లాడుతోందని కొందరు అంటుంటే.. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని మరికొంత మంది సపోర్టు చేస్తున్నారు. మరి, హీరోయిన్‌ కావ్య చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed