మూవీ లవర్స్ కోసం ఒక్కోసారి సందర్భాన్ని బట్టి.. థియేటర్ల యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే ఈసారి యాజమాన్యాలు కాకుండా ఏకంగా సినిమా నిర్మాణ సంస్థే టికెట్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మల్టీప్లెక్స్ ల్లో రూ.112కే సినిమా చూడొచ్చు అని తెలిపింది.
మూవీ లవర్స్ కోసం ఒక్కోసారి సందర్భాన్ని బట్టి.. థియేటర్ల యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. నేషనల్ సినిమా డే, వరల్డ్ సినిమా డేల సందర్భంగా గతంలో టికెట్స్ రేట్స్ పై భారీ ఆఫర్లను ప్రకటించాయి మల్టీప్లెక్స్ లు. అయితే ఈ సారి మూవీ టీమ్స్ సినిమా లవర్స్ కు బంపర్ ఆఫర్ ను ఇచ్చాయి. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ఏ మల్టీప్లెక్స్ లోనైన మార్చి 3న సినిమా టికెట్ కేవలం రూ. 112 రూపాయలు మాత్రమేనని ప్రకటించాయి. మరి ఇంత తక్కువ రేటుకు మల్టీప్లెక్స్ ల్లో సినిమా చూసే అవకాశం కల్పించడం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా హిట్టా.. ఫట్టా అన్నది కలెక్షన్ల ద్వారా కాదు అభిమానుల మౌత్ టాక్ తోనే నిర్దారణకు వస్తుంది. ఆ తర్వాతే కలెక్షన్లతో తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజ్ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా నిర్మాతలుగా పరిచయం అవుతున్నారు దిల్ రాజు కొడుకు, కూతురు.. హన్షిత్, హర్షితలు. వీరిద్దరు నిర్మాతలుగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘బలగం’ జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించాడు. ఇప్పటికే ప్రివ్యూ షోల ద్వారా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది బలగం.
స్వచ్చమైన తెలంగాణ మట్టి పరిమళాలను బలగం చిత్రం ద్వారా ఆవిష్కరించాడు వేణు. దాంతో సినిమా మౌత్ టాక్ ద్వారా రీచ్ ఉండాలని భావించిన మేకర్స్,.. సినిమా ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలగం సినిమాని ఏ మల్టీప్లెక్స్ లో చూసినాగానీ కేవలం రూ.112 రూపాయలే అని ఆఫర్ ప్రకటించారు మేకర్స్. అయితే ఇది రిలీజ్ డేట్ అయిన మార్చి 3వ తారీఖు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇక బలగం సినిమాతో పాటుగా మిగిలిన అన్ని సినిమాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తెలిపాయి. సగటు ప్రేక్షకులు ఈ సినిమాలను చూడాలన్న ఉద్దేశ్యంతోనే టికెట్ ధరను తగ్గించారని తెలుస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేకర్స్ కోరారు. మరి ఇంకెందుకు ఆలస్యం బుక్ మై షోలో ఇప్పుడే మీ టికెట్ ను బుక్ చేసుకుని సినిమాని చూడండి అని మేకర్స్ కోరారు.