తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సినిమా కథలో దమ్ము ఉండాలి గానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడరు ప్రేక్షకులు. కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని మరోసారి నిరూపించింది బలగం సినిమా. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా.. భారీ విజయాన్ని దక్కించుకుంది. వసూళ్లతో పాటుగా ఎన్నో కుటుంబాల మనసులను కొల్లగొట్టింది. అదీకాక ఈ సినిమా చూశాక ఎన్నో విడిపోయిన కుటుంబాలు కలిశాయి అన్న వార్తలు మనం చాలానే చూశాం. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బలగం.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో మారుమ్రోగుతున్న సినిమా. జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం.. భారీ విజయాన్ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం ఎవరూ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అంతా తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఇక బలగం మూవీ సక్సెస్ కావడంతో.. సినిమాలోని లోకెషన్లు కూడా పాపులర్ అయ్యాయి. అందులో హీరో ఇల్లు కూడా ఒకటి. బలగం చిత్రీకరణ జరుపుకున్న ఆ ఇల్లు కోనరావుపేట మండలం, కోలనూరు గ్రామంలో ఉంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇంటి యజమాని రవీంద్రరావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ..
“జబర్దస్త్ వేణుది మా ఊరే. దిల్ రాజు వేణుకు ఛాన్స్ ఇవ్వడంతో.. ఏదైనా సాయం చేయమని నన్ను అడిగాడు వేణు. దాంతో మా ఇల్లును షూటింగ్ కోసం ఇచ్చాను. నెలన్నర పాటు మా ఇంటిని షూటింగ్ కు ఇచ్చి.. మేం వేరే ఇంట్లో ఉన్నాం. ఇక ఇంటిని వాడుకున్నందుకు మాకు డబ్బులు కూడా ఇస్తామన్నారు. కానీ నేనే వేణు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సినిమాలో మా ఇల్లు ఉన్నందుకు సంతోషంగా ఉంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్ని రోజులు షూటింగ్ జరిగినా కానీ దిల్ రాజు అక్కడికి రాలేదు. దిల్ రాజు కూతురు, ఆయన తమ్ముడి కొడుకు మాత్రమే షూటింగ్ చూసుకున్నారని రవీంద్రరావు తెలిపారు. ఇక సినిమా సూపర్ సక్సెస్ అయ్యాక కనీసం వేణు థ్యాంక్స్ కూడా చెప్పలేదని వాపోయాడు ఇంటి యజమాని. ఇప్పటికీ కూడా నేను అతడి నుంచి ఏమీ ఆశించడం లేదని రవీంద్రరావు స్పష్టం చేశాడు. మరి ఈ విషయంపై వేణు ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.